ఆదివాసి యువకులకు వాలీబాల్ కిట్లు అందజేసిన సీఐ .వెంకటేశ్వర్లు
పినపాక, ఆధాబ్ న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక మండలంలోని విప్పల గుంపు గ్రామం లోని ఆదివాసి యువకులకు ఏడూళ్ల బయ్యారం సీఐ. వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజకుమార్ యువకులకు వాలిబాల్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు క్రీడలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది . అన్నారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ , సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 89









