ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్స్ పంపిణీ చేయాలి.. ఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్.

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్ 1 అధాబ్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నందున తెలంగాణ గురుకుల విద్యార్థులకు దుప్పట్లు స్వెటర్స్  పంపిణీ చేయాలని, ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ , ఎస్టి, బీసీ, కస్తూర్భా గురుకులలో, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చలి తీవ్రత వల్ల అనారోగ్యం పాలవుతారని దీన్ని దృష్టటిలో పెట్టు కొని ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు.చాలా వసతి గృహాల్లో కిటికీలు, వెంటీలేటర్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు వసతులతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్ ,బాడిశ సుహష్,జాడి దినేష్ దుర్గం సురేందర్ గోగు సాంబశివరావు, జాడి వినయ్ దుర్గం ప్రసాద్ గోగు సాయి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్