ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేయాలి .

సిపిఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు
కరకగూడెం,డిసెంబర్1ఆధాబ్ న్యూస్:
ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు తుఫాన్లు వస్తున్న కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఆరబెట్టేందుకు టార్పాలిన్లు అవసరం ఉంది అని సిపిఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు అన్నారు. తేమ శాతం తగ్గించేందుకు ధాన్యాన్ని ఆరపెడుతున్నారు. పంటను రక్షించేందుకు టార్పాలిన్ల పట్టాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి, మంచుకు తడిస్తే తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ధరలో కోత విధిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వాలు రాయితీపై ఒక్క టార్పాలిన్ పంపిణీ చేయలేదు. రైతులు అధిక ధర చెల్లించి ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం జోక్యం చేసుకొని మరలా రాయితీపై పట్టాలు పంపిణీ చేసి అండగా ఉండాలన్నారు . ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్