భద్రాద్రి కొత్తగూడెం,ప్రతినిధి ఆధాబ్ న్యూస్: రానున్న మూడు నెలల్లో జరగబోయే పంచాయితీ ఎన్నికలతో పాటు సారపాక పంచాయతీ ఎన్నికలు కూడా జరపాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ కోరుతుందనీ మండల
కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకమండలి లేకపోవటం వల్ల గ్రామంలో అభివృద్ధి నోసుకోవడం లేదని ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇంటి పన్ను ఉన్న ఇల్లు కొనుక్కున్న స్థలం కొనుక్కున్న వారి పేర్లు మార్చుకోవాలన్న రిజిస్టర్లో నమోదు కావడం లేదని స్థానికంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదని అందుకు ప్రభుత్వం సారపాక మేజర్ పంచాయతీగా గుర్తించాలని ఆయన అన్నారు. ఇప్పటికే భద్రాచలం మండలంను మేజర్ పంచాయతీగా ప్రభుత్వం గుర్తించిందని 67 జీవో నెంబర్ని తీసుకొచ్చిందని దాని ద్వారాగా పంచాయతీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సారపాక పంచాయతీ కూడా ఎన్నికల జరిపించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .









