విద్యుత్ సంస్థల్లో శాంక్షన్ పోస్టులు వెంటనే మంజూరు చేయాలి.
పినపాక నవంబర్ 27 ఆధాబ్ న్యూస్ :
విద్యుత్ సంస్థల్లోని కార్మికుల విభాగంలో శాంక్షన్ పోస్ట్లు మంజూరు చేయాలని టీఎస్ పిఈయు -1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న కార్మికుల మీద పని భారం అధికమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్ పియుఈ -1535 ఈ సందర్భంగా కేంద్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్కో ఎస్ పి డీసీఎల్ & ఎన్పీడీసీఎల్ నుండి యూనియన్ శాఖల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెండింగ్ లో ఉన్న డి.ఎ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ సంస్థాగత అంశాలపై మాట్లాడుతూ నూతన కమిటీ లో ప్రతిభావంతమైన నాయకులకు పదవులు కట్టబెట్టి ప్రతిభను ప్రోత్సహిస్తామని చెప్పారు.కార్మిక సంక్షేమానికి అలుపెరుగని పోరాటం చేస్తున్న యూనియన్ తమదేనని కొనియాడారు. కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో యూనియన్ సభ్యత్వం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. వచ్చే ఏడాది నూతన సంవత్సర డైరీ ని,క్యాలెండర్ ఆవిష్కరణల పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి డి. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెనకో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.రాము, జి .కుమారస్వామి ఎన్పీడీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు బుడిగ శ్రీను, మూర్తి,సెంట్రల్ కమిటీ కోశాధికారి పుట్ట నాగేశ్వరరావు , నాయకులు తుంపూరివిజయ్,ఎండి. గౌసిద్దీన్, ఎం.శ్రీధర్, దానం నరసింహారావు, వల్లమళ్ల ప్రకాష్, అంబాల శ్రీను, అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, అల్లాడి పుల్లారావు, వెలదండి ప్రసాద్,ఆర్. రామచందర్,సిద్ధులు హుస్సేన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.









