ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలు మరువలేనివి. సీఐ వెంకటేశ్వరరావు

ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలు మరువలేనివి. సీఐ వెంకటేశ్వరరావు.
కరకగూడెం, నవంబర్ 27 ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం; వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనిదని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు కొనియాడారు.
కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రి పేటలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్ ఆధ్వర్యంలో ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై రాజేందర్ చేతుల మీదుగా చాపలు, డోర్ కర్టెన్స్, చెప్పులు, దుస్తులు, వాటర్ బాటిల్స్, సామాగ్రి పెట్టుకోవడానికి బ్యాగులు, బెడ్ సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.మండలంలో ని వలస ఆదివాసి గ్రామాలలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అనేక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. రానున్న రోజుల్లో వలసి ఆదివాసి గ్రామాలకు స్వచ్ఛత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, వినోద్, ఉమా మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!