ప్రజాపాలన ప్రచార రధాలు ప్రారంభం.
ఆధాబ్ న్యూస్ నవంబర్ 22:
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం విజయవంతంగా ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు రెండు ప్రచార రథాలను అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం వాటిని ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సుజాతనగర్ మండల పరిధిలో తహసిల్దార్ శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలి కళాజాత బృందాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఆట పాటలతో ప్రదర్శనలు ఇస్తూ ప్రజలకు వివరిస్తున్నారు.
Post Views: 54









