నేలకొండపల్లి, నవంబర్ 22 ఆధాబ్ న్యూస్ :
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు క్షేత్రం పర్యటన నిర్వహించారు. మండలం లోని అప్పలనరసింహాపురం లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తృతీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు నెమలిగుట్ట ను క్షేత్ర సందర్శన చేశారు. వృక్షశాస్త్ర, మరియు జంతు శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం ను నిర్వహించారు. అటవీ క్షేత్రం లో ఉన్న వివిధ రకాల వన్య మొక్కలను మరియు వన్య ప్రాణాలను నేరుగా పరిశీలించి వాటిపై పూర్తిగా అవగాహాన మరియు నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. వాటి యెక్క విశిష్టత ను ఆధ్యాపకులు వివరించారు. ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్..ఎస్.శ్యామ్ ప్రసాద్, జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్.శ్రీనివాసకుమార్, గ్రీన్ వే ఎన్విరాన్మెంటల్ సోసైటీ అధ్యక్షుడు డి.రవికుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 45









