జిల్లా అధికారి మధుసూదన్.
పాలేరు, నవంబర్ 19 ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా రైతులందరూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమశాఖ అధికారి ఎం.వి.మధుసూదన్ కోరారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఉద్యానఅధికారి అపర్ణతో కలిసి పలు ఉద్యానపంటలను పరిశీలించారు. ముందుగా కూసుమంచి మండలం లోని చేగొమ్మ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న బొప్పాయి తోటను పరిశీలించారు.అక్కడ రైతులతో మాట్లాడారు. పంటల సాగుకు సంబంధించిన పలు సూచనలు చేశారు. యాజమాన్య పద్దతులపై సూచనలు ఇచ్చారు. అలాగే కూసుమంచి గ్రామం, క్రిష్టపురం గ్రామ పరిధిలో కొత్తగా ఆయిలపామ్ సాగు చేస్తున్న ఆయిలపామ్ పంటను పరిశీలంచారు. రైతులతో మాట్లాడారు. ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారి, మండల వ్యవసాయ శాఖ అధికారి, రైతులు వీరాస్వామి, రమేష్, సత్యనారాయణరెడ్డి, పాల్గొన్నారు.









