ఉచిత కంటి ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకు మందులు పంపిణీ . ఎమ్మెల్యే పాయం .
మణుగూరు, నవంబర్ 17 ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో పుష్పగిరి కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పేషెంట్లకు మందులు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్పగిరి కంటి ఆసుపత్రి మేనేజ్మెంట్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేకమంది పేదలకు ఉచిత కంటి వైద్యం చేసి పేద ప్రజల కంటికి వెలుగునిస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారని భద్రాచలం డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ పేషెంట్ల కొరకు బస్సు సదుపాయం మరియు భోజన సదుపాయాన్ని అందజేసి వారి యొక్క సేవ స్ఫూర్తిని చాటుకున్నారని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పుష్పగిరి హాస్పటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సూపర్డెంట్ సునీల్ ఐ డాక్టర్ సంజీవరావు , డాక్టర్ నరేష్ డాక్టర్ గౌరీ ప్రసాద్ , మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









