ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.

 

మణుగూరు తహశీల్దార్ వి. రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నె. బాబురావు
మణుగూరు,నవంబర్ 9 (ఆధాబ్ న్యూస్) :
మణుగూరులో గ్రామ సింహాల గుంపులు ప్రజల్ని హడలేత్తిస్తున్నాయని వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ
శనివారం మణుగూరు తహశీల్దార్ వి. రాఘవరెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలోని సీతానగరంలో గత రెండు రోజుల క్రితం వీధి కుక్క ఒక చిన్నారి తో పాటు నలుగురు పెద్దలను కూడా తీవ్రంగా గాయపరిచిందని. మండలంలో వీధి కుక్కల వల్ల ఏదో ఒకచోట ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటోందనీ  రాత్రి వేళల్లో కుక్కల అరుపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారని. గురువారం నాడు సింగరేణి కార్మికుడ్ని  తీవ్రంగా గాయపరిచి ఇబ్బంది చేసింది అని  సింగరేణి కార్మికులు నైట్ షిఫ్ట్ డ్యూటీ కి వెళ్లాలన్నా సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని  మున్సిపాలిటీ  పరిధిలోను మరియు గ్రామపంచాయతీల పరిధిలో కుక్కలను నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యశాలలో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచే విధంగా తగు చర్యలు చేపట్టాల్సిందిగా వి. రాఘవ రెడ్డి నీ విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. మణుగూరు మున్సిపల్ కమిషనర్కు కూడా వినతిపత్రం అందజేయనున్నట్లు కర్నే బాబురావు ఈ సందర్భంగా తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్