నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి.
జిల్లా .ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.
భద్రాచలం నవంబర్ 7( ఆధాబ్ న్యూస్ ):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు.భద్రాచలం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల కోసం ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ ను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.24×7 ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు.అక్రమార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. చెక్ పోస్ట్ లో విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఒరిస్సా,ఛత్తీస్గడ్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మారుమూల అటవీ ప్రాంతాల నుండి భద్రాచలం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించకుండా నిషేధిత గంజాయి రవాణాను అరికట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం సీఐ సంజీవ్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మధుప్రసాద్,ఎస్సై విజయలక్ష్మీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.









