ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు.

 

కరకగూడెం, నవంబర్ 3 (ఆధాబ్ న్యూస్ ):అర్హులైన పేదలందరికీ రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరకగూడెం పార్టీ మండల కమిటీ సమావేశం కొమరం మల్లక్క అధ్యక్షతన రేగళ్లలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం వాటి జిల్లా కార్యవర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గతంలో కేటాయించిన ఇల్లులు పూర్తిస్థాయిలో బిల్లులు రాక  అప్పులు చేసి ఇల్లులు నిర్మించుకున్నారని పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించడంలో తీవ్ర వైఫల్యం ఉందని వారన్నారు. తక్షణమే పెండింగ్ బిల్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిజాయితీగా ఇవ్వదలుచుకుంటే పార్టీ కార్యకర్తలతో కమిటీలు ఎందుకని గత ప్రభుత్వం లాగానే పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకునే విధానం సరైంది కాదని అర్హులైన పేద వారందరికీ రాజకీయాలకతీతంగా చెల్లించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే ఆరు గ్యారంటీలను పావుగా వాడుకుంటుందని వాటిని అమలు చేసే పరిస్థితి లేదని దుయ్యబట్టారు .వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న 12000 ఎప్పుడు ఇస్తారు .చెప్పాలని గతంలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై త్వరలోనే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ,మండల కార్యదర్శి కొమరం కాంతారావు ,మండల కమిటీ సభ్యులు సర్ప సత్యం, బిలపాటి శంకరయ్య ,కనితి రాము ,కోవాసి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!