ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇందిర‌మ్మ ఇండ్ల‌ను పూర్తిచేస్తాం. మీడియాతో మంత్రి  పొంగులేటి  శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్

హైద్రాబాద్ , నవంబర్ 3  ( ఆధాబ్ న్యూస్) :మంత్రి పొంగులేటి  శ్రీ‌నివాస‌రెడ్డి మీడియా తో చిట్ చాట్  ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్ట‌యినా స‌రే ఇందిర‌మ్మ ఇండ్ల‌ను పూర్తిచేస్తాం ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం మా ప్ర‌భుత్వానికి చాలా ప్ర‌తిష్టాత్మ‌కము  రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌ 15రోజుల్లొ గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంట‌నే జాబితాల ఖ‌రారు.ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌ గ్రామాల‌లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే ఫైన‌ల్‌ ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు. ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నాం. ఎటువంటి రాజ‌కీయ జోక్యం ఉండ‌దు. నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యత‌ పేద‌రిక‌మే ప్రామాణికంగా ల‌బ్దిదారుల ఎంపిక‌ ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింది ఆధార్‌తో స‌హా అన్నివివరాలు యాప్ లో పొందుప‌రుస్తారు 4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివ‌రాలు సేక‌రించి ముందుకు వెళ్తున్నాం ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చు క‌నీసం 400 చ‌ద‌ర‌పు గ‌జాలు త‌గ్గ‌కుండా ల‌బ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి నాలుగు ద‌శల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిర్మాణ ద‌శ‌ల వారీగా ల‌బ్దిదారుల‌కు చెల్లింపులు. పునాదికి ల‌క్ష‌, గోడ‌ల‌కు లక్షా 25వేలు, శ్లాబ్‌కు ల‌క్ష‌న్న‌ర‌, పూర్త‌యితే ల‌క్ష రూపాయిల చొప్పున చెల్లింపు బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు, కేంద్రం ఇచ్చే నిధుల‌ను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భ‌రిస్తుంది నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 లక్ష‌ల ఇండ్లు నిర్మిస్తాం ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో క‌నీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తాం ఇండ్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా వంట‌గ‌ది, బాత్రూం నిర్మించుకోవాలి ప్ర‌తి మండ‌లంలో కనీసం ఒక‌రు లేదా ఇద్ద‌రు ఎఈ లు ఉండేలా చ‌ర్య‌లు 16 శాఖ‌ల‌కు చెందిన వారిని స‌మీక‌రించి ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ బాధ్య‌తలు అప్ప‌గిస్తాం ఒకే గొడుగు నీడ‌న ఇంజ‌నీర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇండ్ల నిర్మాణం జ‌రిగేలా చ‌ర్య‌లు ప్ర‌భుత్వం త‌ర‌పున 5 ల‌క్ష‌ల సాయం ఇస్తాం.అని ఆయన అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!