దీపావళి టపాసులు కాల్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.
కరకగూడెం,అక్టోబర్ 30 (ఆధాబ్ న్యూస్) :మండలం లోని పలు గ్రామాల్లో దీపావళి సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రాజేందర్ సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా అవసరమని ఆయన అన్నారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు కాల్చాలని, మరియు ఇతరులకు అంతరాయం కలిగించే స్థలాల్లో కాకుండా ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలని సూచించారు. నాణ్యమైన టపాసులు మాత్రమే ఉపయోగించుకోవాలని, రహదారుల మీద లేదా జనసంచార ప్రాంతాల్లో టపాసులు కాల్చకూడదని హెచ్చరించారు.
అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, దగ్గరలోనే నీటి బకెట్ మరియు జుట్టు చీరలు కప్పడం కోసం ఉపయోగించే తడి వస్త్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన అన్నారు.









