ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీఈఐఆర్ ద్వారా చోరీకి గురైన రెండు స్మార్ట్ ఫోన్ల రికవరీ

సీఈఐఆర్ ద్వారా చోరీకి గురైన రెండు స్మార్ట్ ఫోన్ల రికవరీ.

బాధితులకు అప్పగించిన సీఐ వెంకటేశ్వరావు,ఎస్సై రాజ్ కుమార్.

పినపాక,అక్టోబర్ 30 (ఆధాబ్ న్యూస్ ):                     చోరీ కి గురైన స్మార్ట్ ఫోన్లను పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు,ఎస్సై రాజ్ కుమార్ బాధితులకు బుధవారం అప్పగించారు. పోలీసులు మొబైల్ ఫోన్ లను ట్రేసింగ్ ద్వారా చోరీకి గురైన ఫోన్ లను పట్టుకున్నారు. ఈ విషయంపై బాధితులు పినపాక మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కొత్తగా వచ్చిన సీఈఐఆర్ అప్లికేషన్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్) ద్వారా ట్రేసింగ్ చేసి రికవరీ చేశారు. బాధితులు పత్రికా విలేకర్ కొంపెల్లి నగేష్ , మరో వ్యక్తికి సీఐ వెంకటేశ్వరరావు,ఎస్ఐ రాజ్ కుమార్ లు మొబైల్ ఫోన్ లను అందజేశారు. కేంద్ర టెలికాం మంత్రుత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా పోయిన సెల్ ఫోన్ లను ట్రేసింగ్ చేసి గుర్తించవచ్చని తెలిపారు. భాదితులు సిఈఐఆర్ లో రిజిస్ట్రేషన్ చేస్తే పోయిన సెల్ ఫోన్ లు తప్పకుండా దొరుకుతాయని ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరావు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్