ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కౌలు రైతులు, రైతు కూలీలకు వెంటనే నగదు చెల్లించాలి.

కరకగూడెం,అక్టోబర్ 29 (ఆధాబ్ న్యూస్):  కౌలు రైతులు,రైతు కూలీలకు వెంటనే నగదు అమలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులు అత్తె ముకుందారావు అధ్యక్షతన రైతు శ్రేయస్సు కోసం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన మేరకు హామీలలో కౌలు రైతుకు 15,000/-,రైతు కూలీలకు 12,000/- నగదు వెంటనే చెల్లించే దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని డిమాండ్ చేశారు.లేనిపోని మయమాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామల్లో అభివృద్ది,సంక్షేమ పథకాలు పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు,కౌలు రైతులకు,రైతుకూలీలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ అత్తె సత్తనారయణ,పాయం క్రిష్ణ,అంజయ్య,రంజిత్,సీతయ్య,సురేష్, ప్రసాద్,రాజేశ్వరావు,వెంకన్న,సూర్యం,రైతులు కొమరం నాగేశ్వరావు,వెంగళి వెంకన్న, కొమరం బోర్రయ్య,అత్తె సతీష్, ముసలయ్య,వీరయ్య,లక్ష్మణ్,జయరాజు,మహిళ రైతులు లక్ష్మి,రజిత, నాగమణి,స్వరూప,స్వప్న.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!