ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది.
మొత్తం 17 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా, 11 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. మరో 6 శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణికి వస్తుండగా, సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజావాణి వంటి ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 9








