ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  నాగపూర్‌లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ – తెలంగాణకు ఘన విజయం

నాగపూర్‌లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ – తెలంగాణకు ఘన విజయం
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్‌లో మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ రాష్ట్రం ప్రతిభ చాటింది. ఆంటీ సబోటేజ్ చెక్ విభాగంలో తెలంగాణ జట్టు విశేషంగా రాణించి పలు విభాగాల్లో పతకాలు కైవసం చేసుకుంది.

యాక్సెస్ కంట్రోల్ విభాగంలో సిల్వర్ మెడల్, వీవీఐపీ రూమ్ సెర్చ్ మరియు వీవీఐపీ వెహికిల్ సెర్చ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. ఈ విజయంతో తెలంగాణ రాష్ట్రం ఆల్ ఇండియా స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను వరుసగా మూడోసారి గెలుచుకుంది.

చీఫ్ కోచ్ ఎం. రామకృష్ణ (ఎస్పీ, 8వ బెటాలియన్, కొండాపూర్) ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు కఠిన శిక్షణ అందించడంతో ఈ విజయాన్ని సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ విజయానికి తోడ్పడిన మహబూబాబాద్ జిల్లా బీడీ టీం కోచ్ కే. అంజయ్యను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ ఎం. శ్రీనివాస్, ఆర్.ఐలు సోములు, టీ. నాగేశ్వర్ రావు, ఆర్.ఎస్.ఐ జి. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….