ప్రతి క్షణం
ప్రజల పక్షం

గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

  కరకగూడెం పీహెచ్‌సీలో మార్చి 11న స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ – మండల ప్రజలకు అరుదైన వైద్య సేవలు

కరకగూడెం పీహెచ్‌సీలో మార్చి 11న స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ – మండల ప్రజలకు అరుదైన వైద్య సేవలు

కరకగూడెం, మార్చి 9: ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ ను ఈ నెల **మార్చి 11న కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)**లో నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ పి. రవితేజ తెలిపారు.

ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో పలు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు.

క్యాంపులో భాగంగా స్త్రీ రోగ నిపుణులు (గైనకాలజిస్టు), చిన్నపిల్లల వైద్యులు (పీడియాట్రిషన్), కంటి వైద్యులు (ఆప్తమాలజిస్టు), ఎముకలు–కీళ్ల నిపుణులు (ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్), జనరల్ మెడిసిన్ వైద్యులు, డెంటల్ స్పెషలిస్టులు ప్రజలను పరీక్షించి అవసరమైన చికిత్సలు అందించనున్నారు.

ఈ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. మండలంలోని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రవితేజ కోరారు.

అవసరమైన వారికి తగిన వైద్య సలహాలు, చికిత్సలు అందించబడతాయని ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు