ప్రతి క్షణం
ప్రజల పక్షం

గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

  గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న

గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ

దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న

హైదరాబాద్, అక్టోబర్ 26 (ఆధాబ్ న్యూస్): విధి నిర్వహణలో ఉండగా ప్రయాణికురాలి దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళికను టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సిహెచ్. వెంకన్న సోమవారం పరామర్శించారు.

పలువురు అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ఈడీ వెంకన్న.. ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

అనంతరం ప్రవళికతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రవళికకు అన్ని విధాలా అండగా ఉంటుందని, సంస్థ తరఫున సంపూర్ణ భరోసా కల్పిస్తామని తెలిపారు. కండక్టర్‌పై దాడికి పాల్పడిన నిందితురాలిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులను ఎంతమాత్రం సహించేది లేదని ఈడీ వెంకన్న హెచ్చరించారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు యాజమాన్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, కండక్టర్ ప్రవళిక ఆరోగ్య పరిస్థితిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రవళికకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

— ఆధాబ్ న్యూస్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు