ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్
కండక్టర్‌కు తీవ్ర గాయాలు
ఆధాబ్ న్యూస్ ,అశ్వాపురం:
అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆధార్ కార్డు లేకుండా బస్సు ఎక్కిన ఓ ప్రయాణికురాలిని టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరినట్లు సమాచారం.
ఆధార్ కార్డు లేకపోవడంతో టికెట్‌కు డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరగా, ప్రయాణికురాలు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికురాలు కండక్టర్‌ను నెట్టడంతో ఆయన అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడిపోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కండక్టర్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆధాబ్ న్యూస్
www.aadhabnews.in
Post Views: 7








