గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్ వేదిక
– విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు
ఆధాబ్ న్యూస్ ,తాడ్వాయి: యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లోనూ రాణించాలని కరకగూడెం, తాడ్వాయి ఎస్సైలు పి.వి. నాగేశ్వరరావు, మధుకర్ పిలుపునిచ్చారు.
దసరా పండుగ సందర్భంగా తాడ్వాయి మండలంలోని రంగాపురం స్కూల్ మైదానంలో సామ్మక్క–సారలమ్మ తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కరకగూడెం, పినపాక, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల మండలాల స్థాయిలో నిర్వహించిన వీపీఎల్–6 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా విజేతలకు కరకగూడెం, తాడ్వాయి ఎస్సైలు పి.వి. నాగేశ్వరరావు, మధుకర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్లో విజేతగా నిలిచిన నవీన్–11 జట్టుకు రూ.25,116, రన్నరప్‌గా నిలిచిన బ్లూ స్టార్–11 జట్టుకు రూ.15,116 నగదు బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ క్రీడలు యువతీ యువకుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువత భవిష్యత్తులో దేశ ప్రగతికి తోడ్పడేలా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, పట్టణాల్లో ఐపీఎల్ తరహాలో నిర్వహించే ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్‌ను గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడం ద్వారా స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు మంచి అవకాశం కల్పించారని నిర్వాహకులను అభినందించారు.
టోర్నమెంట్‌కు సహకరించిన ఊసం ఉపేంద్ర, గోగు శ్రీను, ఆర్మీ విజయ్‌తో పాటు అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పినపాక హౌసింగ్ ఏఈ గుమ్మడి వినీత, అనంతారం సర్పంచ్ పాయం కృష్ణవేణి, నర్సాపురం మాజీ సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, ఇర్ప సూర్యం, గుమ్మడి ముత్తయ్య, సీనియర్ ప్లేయర్లు జాడి రాకేష్, రియాజ్, ఎట్టి ప్రసాద్, టోర్నమెంట్ నిర్వాహకులు గుడ్ల రంజిత్, యంగళి గోపి, పాయం సుధాకర్, ప్రశాంత్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








