ప్రతి క్షణం
ప్రజల పక్షం

గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

  కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు – లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్

కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు – లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మేడ్చల్,ఆధాబ్ న్యూస్:
మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (ఫ్యామిలీ సర్టిఫికెట్) జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేయడానికి సంబంధిత వ్యక్తి వద్ద నుంచి రూ.30,000 లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ గణేష్, తొలి విడతగా రూ.15,000 స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.

బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం ట్రాప్ నిర్వహించినట్లు తెలిసింది. లంచం తీసుకుంటున్న సమయంలోనే గణేష్‌ను అదుపులోకి తీసుకుని కార్యాలయంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అభియోగిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు