ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు

ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు

పినపాక, ఫిబ్రవరి 28 ఆధాబ్ న్యూస్ : ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా పినపాక మండలంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్‌లో సీనియర్ టైలర్ మేడగం సామ్రాజ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా టైలర్లు జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో మహిళా టైలర్ల పాత్ర కీలకమని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా అనేక కుటుంబాలు స్థిరపడుతున్నాయని పేర్కొన్నారు. చిన్న స్థాయి వృత్తిగా ప్రారంభమైన టైలరింగ్ నేడు ఫ్యాషన్ రంగంలోనూ ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టైలరింగ్ ప్రధాన ఆధారంగా నిలుస్తోందని వివరించారు. మహిళా టైలర్లు కేవలం దుస్తులు కుట్టడమే కాకుండా కొత్త డిజైన్లు రూపొందిస్తూ స్థానిక మార్కెట్‌లో గుర్తింపు పొందుతున్నారని చెప్పారు. పండుగలు, వివాహాలు, పాఠశాల యూనిఫాంల తయారీలో వారి సేవలు ముఖ్యమని తెలిపారు.

తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ వృత్తి మహిళలకు ఆర్థిక స్వావలంబనను అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం టైలర్లకు అందిస్తున్న రుణాలు, శిక్షణా కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. యువతులు టైలరింగ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మేడగం సామ్రాజ్యం, అక్కెర వేణుగోపాలాచారి, గంగిరెడ్డి సౌజన్య, గుండు అనిత, దల్లి శైలజ, గీద అమూల్య, వసంతతో పాటు మండలంలోని వివిధ గ్రామాల టైలర్లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….