అర్నబ్ తుఫాన్‌తో ఏపీలో భీతావహ పరిస్థితులు
కోనసీమ తీరంలో 120–140 కి.మీ. వేగంతో పెనుగాలులు.. కాకినాడలో కాలనీల్లోకి సముద్రపు నీరు
ఆధాబ్ న్యూస్ ,ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కోనసీమ తీర ప్రాంతంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
తుఫాన్ ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో తీర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాకినాడ తీర ప్రాంతంలోని పలు కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితుల నేపథ్యంలో పలువురు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.
www.aadhabnews.in








