భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు
ఆర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు
ఆధాబ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఆర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రత దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ఒక రోజు సెలవు ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్ 28న సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంకిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితిని బట్టి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
www.aadhabnews.in








