ప్రతి క్షణం
ప్రజల పక్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు ఆర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు అర్నబ్ తుఫాన్‌తో ఏపీలో భీతావహ పరిస్థితులు కోనసీమ తీరంలో 120–140 కి.మీ. వేగంతో పెనుగాలులు.. కాకినాడలో కాలనీల్లోకి సముద్రపు నీరు ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం : కాంగ్రెస్ నాయకులు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టుబాటు.. కానిస్టేబుల్ కూడా అదుపులో మణుగూరులో 4.1 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు శిక్ష

  మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టుబాటు.. కానిస్టేబుల్ కూడా అదుపులో

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు

రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టుబాటు.. కానిస్టేబుల్ కూడా అదుపులో

ఆధాబ్ న్యూస్, ఖమ్మం: పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.

లంచం తీసుకుంటున్న సమయంలో ఇన్‌స్పెక్టర్ కొండలరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

www.aadhabnews.in

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు