ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  దమ్మపేటలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

దమ్మపేటలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

దమ్మపేట, ఫిబ్రవరి 17 (ఆధాబ్ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్ సేవలను కొనియాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించి, దశాబ్దం పాటు అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. భవిష్యత్తులో మళ్లీ తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సోయం వీరభద్రం, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దారా యుగంధర్, మాజీ సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, జలగం వాసు, చీకట్ రామారావు, రావుల శ్రీను, అబ్దుల్ జిన్నా, తుమ్మల లక్ష్మణ్ రావు, గాజుబోయిన ఎసుబాబు, తాటి పోతురాజు, సోడెం గంగరాజు, యూత్ అధ్యక్షుడు మండవ సత్య, యార్లగడ్డ శ్రీను, కాసిని శ్రీను, మహేశ్, మద్దెల పుల్లారావు, నాగరాజు, ప్రసాద్, నరేంద్ర, రవి, రామకృష్ణ, రాజారావు, పసుమర్తి రాంబద్రం, వార్డ్ మెంబర్లు గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, రూపా రాంబాబు, ఉయ్యాల లక్ష్మీ నారాయణ, ఏడుకొండలు, మీడియం సురేష్, పాయం ప్రవీణ్, కోర్స వెంకటేష్, మధు, ఇప్ప శేషాద్రి, భూక్యా రాజు, కిస్ట సత్తి, పానుగంటి లోకేష్, పోలారావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….