ప్రతి క్షణం
ప్రజల పక్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు ఆర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు అర్నబ్ తుఫాన్‌తో ఏపీలో భీతావహ పరిస్థితులు కోనసీమ తీరంలో 120–140 కి.మీ. వేగంతో పెనుగాలులు.. కాకినాడలో కాలనీల్లోకి సముద్రపు నీరు ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం : కాంగ్రెస్ నాయకులు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టుబాటు.. కానిస్టేబుల్ కూడా అదుపులో మణుగూరులో 4.1 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు శిక్ష

  మేడారం వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

మేడారం వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా
ఐదుగురికి తీవ్ర గాయాలు

ములుగు,ఆధాబ్ న్యూస్: మేడారంకు భక్తులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి వెళ్తున్న వాహనం, తాడ్వాయి దాటిన సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు