ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  కరకగూడెం గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ అక్షరమే ఆయుధం – జ్ఞానమే శక్తి : డాక్టర్ షేక్ మస్తాన్ హుస్సేన్

కరకగూడెం గ్రామంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
అక్షరమే ఆయుధం – జ్ఞానమే శక్తి : డాక్టర్ షేక్ మస్తాన్ హుస్సేన్

కరకగూడెం ,ఆధాబ్ న్యూస్:
విద్య అనేది కేవలం అక్షరాలు నేర్పే పాఠ్యాంశం మాత్రమే కాకుండా, సమాజంలోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే శక్తివంతమైన ఆయుధమని డాక్టర్ షేక్ మస్తాన్ హుస్సేన్ పేర్కొన్నారు. ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ ఆధ్వర్యంలో, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా సమన్వయంతో పడిగాపురం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యాసామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మస్తాన్ హుస్సేన్ మాట్లాడుతూ, పిల్లలు నేటి విద్యార్థులే కాదు, రేపటి పౌరులని, వారి భవిష్యత్‌ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా విద్య ఉండాలని సూచించారు.

ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మానసిక—శారీరక ఆరోగ్య పరిరక్షణలో ప్రాణిక్ హీలింగ్ సేవలు, సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన అభినందించారు.

కార్యక్రమంలో భాగంగా సుమారు 50 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఇది పెద్ద సహాయమవుతుందని డాక్టర్ హుస్సేన్ పేర్కొన్నారు.

తరువాత మాట్లాడిన ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు షేక్ వసీం అక్రం, గ్రామస్థులు స్వామి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….