ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  రేగళ్ల పంచాయతీలో 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

రేగళ్ల పంచాయతీలో 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామపంచాయతీలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను శనివారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్లుగా ప్రజలకు రాకపోయిన రేషన్‌కార్డులు ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారికి వేగంగా జారీ అవుతున్నాయని తెలిపారు. ప్రతి అర్హుడికి 6 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ, సొంతింటి కలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.

అదే విధంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కి గ్యాస్ సిలిండర్, వడ్డీలేని రుణాలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం వంటి పథకాలను ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్నట్లు వివరించారు.

అనంతరం గ్రామస్తులు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో ఎమ్మెల్యేకు అందజేయగా, వాటిని సంబంధిత శాఖాధికారులు తక్షణం పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో MRO కాంతారావు, MPO, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్ మండల రాజకీయ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….