ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ఇక సెలవు…! ప్రముఖ కవి–రచయిత అందెశ్రీకు కన్నీరంటి వీడ్కోలు

ఇక సెలవు…! ప్రముఖ కవి–రచయిత అందెశ్రీకు కన్నీరంటి వీడ్కోలు

హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్:
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ లో మంగళవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయన పార్థివ దేహానికి వేలాది మంది సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు చివరి వీడ్కోలు చెప్పారు.

అంత్యయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని అందెశ్రీ పాడెను భుజాన మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆప్యాయంగా ఓదార్చారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం, గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తరువాత అందెశ్రీ పార్థివ దేహాన్ని సమాధి చేశారు.

ఉదయం నుంచే పలువురు నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. సీనియర్‌ నేత కేశవరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

లాలాపేట్‌ నుంచి ప్రారంభమైన పార్థివ దేహం, తార్నాక – ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్‌ చేరుకుంది. కవి, రచయిత, సాంస్కృతిక యోధుడైన అందెశ్రీకు శ్రద్ధాంజలి అర్పిస్తూ ప్రజలు ‘ఇక సెలవు…!’ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….