ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  ఫెడరేషన్ & జూనియర్ జాతీయ అథ్లెటిక్స్‌లో రెండు బంగారు పథకాలు అభినందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, ఆధాబ్ న్యూస్: 24 అక్టోబర్ 2025

ఫెడరేషన్ & జూనియర్ జాతీయ అథ్లెటిక్స్‌లో రెండు బంగారు పథకాలు
అభినందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 23వ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో బంగారు పథకం, అలాగే ఒడిశా భువనేశ్వర్‌లో జరిగిన 40వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మరో బంగారు పథకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన అథ్లెట్ తోలేం శ్రీతేజను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు.

శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ—
“శ్రీతేజ దేశంలోని పలు ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ పోటీలలో ముందంజలో నిలుస్తూ రాష్ట్రానికి పేరు, ప్రతిష్టలను తీసుకొస్తోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయస్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
అటు క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని నాయకులు తెలిపారు.

గతంలో 19వ నేషనల్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 బిలాస్పూర్‌లో కాంస్యం, 35వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గుంటూరులో బంగారం, 39వ జూనియర్ నేషనల్స్ భువనేశ్వర్‌లో రజతం సాధించి శ్రీతేజ క్రీడారంగంలో నిలువెత్తు ప్రతిభను నిరూపించిన విషయం తెలిసిందే.

కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మండల నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….