ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  కరకగూడెం మండలంలో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కరకగూడెం మండలంలో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి పంచాయతీ పరిధిలోని రైతు వేదికలో ఆదివారం నూతన రేషన్ కార్డులు మరియు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత దశాబ్దంలో BRS ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరులో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించాలనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. కరకగూడెం మండలంలో 904 రేషన్ కార్డుల ద్వారా 2,340 మంది లబ్ధి పొందుతున్నారని, మొత్తం మండల వ్యాప్తంగా 5,020 రేషన్ కార్డుల ద్వారా 16,730 మందికి లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.

అదే విధంగా, 15 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.15,01,740 విలువైన చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మంజూరైనవారు త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు 6 కిలోల సన్న బియ్యం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు మరియు ఇందిరమ్మ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో MRO గంట ప్రతాప్, MPDO మారుతి, సివిల్ సప్లయిస్ DT శివకుమార్, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….