ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా జెండా ఎగరేసిన రేగా కాంతారావు – ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా
జెండా ఎగరేసిన రేగా కాంతారావు – ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది. పినపాక మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరేసి, కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మండలంలోని 16 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసులు సీతారాంపురం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, డీజే పాటలు, కొమ్ము డాన్సులు, సంప్రదాయ నృత్యాలతో మూడు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా కరకగూడెం ప్రధాన కేంద్రం నుంచి వీరాపురం క్రాస్‌ వరకు ప్రదర్శన సాగింది.

మహానీయుల స్ఫూర్తి
“ఆదివాసి అస్తిత్వాన్ని కాపాడిన మహానీయుడు కొమరం భీం ఆశయాలను ప్రతి ఆదివాసి బిడ్డ ముందుకు తీసుకెళ్లాలి” అని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.

సాంస్కృతిక విందు
కార్యక్రమంలో కొత్తూరు గ్రామ చిన్నారుల వేషధారణ నృత్యాలు, తుమ్మలగూడెం యువత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం ఆదివాసి జేఏసీ ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనం విందుగా అందించారు.

ఈ వేడుకల్లో ఆదివాసి జేఏసీ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, పటేళ్లు, యువజన నాయకులు, పెద్ద సంఖ్యలో ఆదివాసి ప్రజలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….