ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఓ చేత్తో ఫోన్, మరో చేత్తో బండి..! జీవితాలతో ఆటలాడుతున్నారా?

ఓ చేత్తో ఫోన్, మరో చేత్తో బండి..! జీవితాలతో ఆటలాడుతున్నారా?

భద్రాచలం ఆధాబ్ న్యూస్:
వాహనం నడుపుతూనే ఫోన్ మాట్లాడడం, మెసేజ్లు టైప్ చేయడం, హెల్మెట్‌లో ఫోన్ ఇరికించుకుని మెడవాల్చి మాట్లాడటం… ఇవన్నీ తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతున్నాయని భద్రాచలం మోటార్ వెహికల్ అధికారి వెంకట పుల్లయ్య తెలిపారు.

“ఒక చేత్తో బండి నడుపుతూ, మరో చేత్తో ఫోన్ వాడటం, హెల్మెట్‌కు చెవికి మధ్య ఫోన్ ఇరికించడం — ఇవి ప్రమాదాలకు ఆహ్వానం పలికినట్లే. ఈ నిర్లక్ష్యపు చర్యలు మీ ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాయి. వాహనం ఆపి మాట్లాడటం మంచిది. డ్రైవింగ్ చేస్తున్నపుడు ఫోన్‌ను పూర్తిగా దూరంగా ఉంచడం అవసరం” అని పేర్కొన్నారు.

వాహనదారులంతా చట్టాలను పాటిస్తూ, తమకూ ఇతరులకూ ప్రాణ భద్రత కల్పించేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!