కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ
డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ పరిశీలన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ నవంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) తుకారాం రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని డీఎంహెచ్వో సూచించారు.
— ఆధాబ్ న్యూస్
Post Views: 40








