మణుగూరులో ఉచిత రక్తదాన శిబిరం
ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం, అక్టోబర్ 29:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మణుగూరు పోలీస్ స్టేషన్లోని కమ్యూనిటీ హాల్లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు కరకగూడెం ఎస్ఐ పి.వి.ఎన్.రావు తెలిపారు.
ఈ రక్తదాన శిబిరానికి మండలంలోని యువత, ప్రజలు, వాలంటీర్లు, రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీసులు కోరారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు సింహాచలం – 8247745987, వినోద్ – 8712509713 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ పి.వి.ఎన్.రావు సూచించారు.
Post Views: 35








