ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి

గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి

ఆధాబ్ న్యూస్ , కరకగూడెం, నవంబర్ 1: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సీపీఐ(ఎం) కరకగూడెం మండల కార్యదర్శి కొమరం కాంతారావు కోరారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే అభ్యర్థులకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ(ఎం), వామపక్షాల పూర్తి మద్దతుతో ప్రజాసంఘాల అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తూ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలిచే అభ్యర్థిని గెలిపించుకోవడంలో గ్రాడ్యుయేట్ ఓటు కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని, అర్హత కలిగిన పట్టభద్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా నవంబర్ 6వ తేదీలోగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని కొమరం కాంతారావు విజ్ఞప్తి చేశారు.

ఆధాబ్ న్యూస్
www.aadhabnews.in

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు