ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ: 14 కళాశాలలకు రూ.3.31 కోట్లు విడుదల
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (ఆధాబ్ న్యూస్):
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ దక్కింది. డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ వారు జిల్లాలో ఉన్న 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 3,31,15,000 విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హెచ్. వెంకటేశ్వరరావు తెలిపారు.
అదే విధంగా, ప్రతి కళాశాలకు రూ.10,000 చొప్పున క్రీడా సామాగ్రి కొనుగోలు కోసం మరియు కళాశాల నిర్వహణకు కావాల్సిన వ్యయాల కోసం కలిపి రూ.3,16,000 విడుదల చేసినట్టు వెల్లడించారు.
ఈ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వేళ, ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.
Post Views: 32









