ప్రతి క్షణం
ప్రజల పక్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు ఆర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు అర్నబ్ తుఫాన్‌తో ఏపీలో భీతావహ పరిస్థితులు కోనసీమ తీరంలో 120–140 కి.మీ. వేగంతో పెనుగాలులు.. కాకినాడలో కాలనీల్లోకి సముద్రపు నీరు ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం : కాంగ్రెస్ నాయకులు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టుబాటు.. కానిస్టేబుల్ కూడా అదుపులో మణుగూరులో 4.1 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు శిక్ష

  ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం : కాంగ్రెస్ నాయకులు

ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం : కాంగ్రెస్ నాయకులు

ఆధాబ్ న్యూస్,కరకగూడెం : తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం కరకగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత సేవలందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు, సర్పంచులు పోలేబోయిన సుజాత, ఎర్రం పొట్టయ్య, ఎల్లబోయిన ముత్తమ్మ, బాడిష పార్వతి, కొమరం సుగుణ, ఉపసర్పంచులు పూజారి వెంకన్న, గాంధర్ల రామనాథం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాడి శ్రీను, మండల నాయకులు గొగ్గలి రవి, షేక్ రఫీ, మేడి శ్రీను, మాజీ ఉపసర్పంచులు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

www.aadhabnews.in

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు