మణుగూరులో 4.1 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
మణుగూరు, అక్టోబర్ 28 (ఆధాబ్ న్యూస్):
మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలోని సీతారామ కెనాల్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు.
వారి వద్ద నుంచి 4.1 కిలోల ఎండు గంజాయి, ఒక హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
ఈ వివరాలను మణుగూరు ఎక్సైజ్ సీఐ కె. నాగేశ్వరరావు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Post Views: 22








