డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్ష
కొత్తగూడెం, అక్టోబర్ 28 (ఆధాబ్ న్యూస్):
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురికి కొత్తగూడెం 2వ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని గుర్తించి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ముగ్గురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించిన సమయంలో వాహనాలు నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.








