భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన “హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్” కార్యక్రమం 04.03.2026 నుండి 09.06.2026 వరకు నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ Ankit ఆధ్వర్యంలో, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి Dr. Tukaram Rathod పర్యవేక్షణలో దశల వారీగా అమలు చేయబడుతుంది.
ఒకటవ దశ – I (1–30 రోజులు)
04.03.2026 – 31.03.2026
జిల్లాలోని అన్ని PHCs మరియు UPHCs లో 6 మంది నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి:
శిశు వైద్యుడు (Pediatrician)
స్త్రీ రోగ నిపుణుడు (Gynecologist)
జనరల్ ఫిజీషియన్
దంత వైద్యుడు
కంటి నిపుణుడు
ఎముకల వైద్య నిపుణుడు (Orthopedic Surgeon)
అలాగే అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలను RBSK బృందాలు సందర్శించి విద్యార్థులకు స్క్రీనింగ్ మరియు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.
విద్యార్థులకు 3 మంది నిపుణుల ద్వారా ప్రత్యేక పరీక్షలు:
స్త్రీ రోగ నిపుణుడు / ఫిజీషియన్
దంత వైద్యుడు
కంటి నిపుణుడు
రెండవ దశ – II (31–45 రోజులు)
01.04.2026 – 15.04.2026
ఆసాంక్రమిక వ్యాధుల (Non-Communicable Diseases) స్క్రీనింగ్, చికిత్స, రిఫరల్ & ఫాలోఅప్
క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు
DCCC ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స & ఫాలోఅప్ కార్యక్రమాలు
మూడవ దశ – III (46–75 రోజులు)
16.04.2026 – 15.05.2026
సంక్రమణ వ్యాధుల (Communicable Diseases) స్క్రీనింగ్
ప్రజారోగ్య సిద్ధత చర్యలు
హీట్ స్ట్రోక్ రూమ్‌ల ప్రారంభం
నాలుగవ దశ – IV (76–100 రోజులు)
16.05.2026 – 09.06.2026
అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 8 స్పెషలిస్ట్ క్లినిక్స్ ఏర్పాటు
తృతీయ స్థాయి ఆసుపత్రులపై భారం తగ్గించే చర్యలు
100 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు
స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల ఆరోగ్య ప్రొఫైలింగ్ – 30 ప్రాథమిక పరీక్షలు
ఆరోగ్య కేంద్రాల ప్రమాణీకరణ (IPHS, NQAS, కాయకల్ప)
జిల్లా ప్రజలు ఈ ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ విజ్ఞప్తి చేశారు.
“జిల్లా ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం” అని వారు తెలిపారు.









