ప్రతి క్షణం
ప్రజల పక్షం

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

  వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

కరకగూడెం,ఫిబ్రవరి 28 ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహ మహోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నూతన విద్యుత్ దీపాలను సమకూర్చారు.

గ్రామ సర్పంచ్ పోలేబోయిన సుజాత ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రపరచించి, గుడి అలంకరణ కోసం కొత్త లైట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉప సర్పంచ్ బుడగం రాము పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి వారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, వివాహ మహోత్సవ వేడుకలు శాంతి, ఐక్యతతో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, మండల నాయకులు గొగ్గలి రవి, ముంజాల సాయిబాబా, సోలం బాబు, కొమరం భూషణం, వార్డు మెంబర్ వేణు, బిలపాటి సంపత్ తదితరులతో పాటు భక్తులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు