ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కరకగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కరకగూడెం,ఫిబ్రవరి 17 ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు కేసీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయన తెలంగాణ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్