ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  మూడు దశాబ్దాల తర్వాత లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టు నేత సాంబయ్య

మూడు దశాబ్దాల తర్వాత లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టు నేత సాంబయ్య

ములుగు,ఆధాబ్ న్యూస్:
మావోయిస్టు నేత కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న అలియాస్ ఆజాద్ లొంగిపోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ఆయన లొంగుబాటు విషయంపై జరుగుతున్న ప్రచారాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సాంబయ్య లొంగిపోతున్న విషయం కుటుంబసభ్యులతో కూడిన వర్గాలు నిర్ధారించాయి.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడాకు చెందిన సాంబయ్య మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆయన లొంగుబాటుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం దేశం నుండి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సంకల్పబద్ధంగా చర్యలు తీసుకుంటోంది. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిజం పూర్తిగా అంతరించిపోతుందనే లక్ష్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్దఎత్తున ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఎదురు తిరిగిన మావోయిస్టులను ఎన్‌కౌంటర్లలో ఏరిపారేస్తుండటంతో పాటు, లొంగుబాటు కానున్న వారికి పునరావాస మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో అనేక మంది మావోయిస్టులు లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సాంబయ్య లొంగుబాటు ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పరిణామంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….