ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి – డీఆర్‌డీఓ విద్యా చందన

సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి – డీఆర్‌డీఓ విద్యా చందన

భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించడంతోపాటు సంఘాలు తీసుకున్న రుణాలను సమయానికి తిరిగి చెల్లించాల‌ని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.విద్యా చందన సూచించారు.

జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో సీనియర్ సిఆర్‌పి (CRP) స్ట్రాటజీ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ సంఘాలు (VOs), మండల సమాఖ్యలు (MS) పనితీరును సమీక్షించేందుకు 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ గత 15 రోజులుగా విస్తృత పర్యటన చేపట్టారు.

గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించిన పర్యటన అనంతరం బుధవారం ఐడీసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ విద్యా చందన పాల్గొని సిఆర్‌పిలు సమర్పించిన నివేదికలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తీసుకున్న రుణాలను సమయానికి చెల్లిస్తూ, సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి. పుస్తక నిర్వహణ క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణను బలోపేతం చేయాలి,” అని సూచించారు.

సభ్యులు శిక్షణా కార్యక్రమాల ద్వారా అవగాహన పెంపొందించుకొని స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని, సీనియర్ సిఆర్‌పిలు గ్రామ స్థాయిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు మార్గదర్శకత ఇవ్వాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ నీలేష్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, డిపిఎం సి.హెచ్. అనూరాధ, సీనియర్ సిఆర్‌పిలు, అన్ని మండలాల ఏపిఎంలు, వీవో అధ్యక్షులు, సిసిలు, వీవోఏలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….