ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  కరకగూడెం: రోడ్లపై గుంతల మరమ్మత్తులు వెంటనే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

కరకగూడెం: రోడ్లపై గుంతల మరమ్మత్తులు వెంటనే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతూనే ఉందని, కానీ పనులు మాత్రం కనబడడంలేదని విమర్శించారు. బయ్యారం (కరకగూడెం) – తాడ్వాయి ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్లు మరమ్మత్తులు చేయకపోతే ప్రాణనష్టం జరిగే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. వెంటనే స్పందించి డీఎంఎఫ్టీ, సీఏస్ఆర్ నిధుల ద్వారా రోడ్లపై ఏర్పడిన గుంతలను మరమ్మత్తులు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సమస్య పరిష్కారం కానట్లయితే భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని సోమయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొమరం రాంబాబు, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రేగా సత్యనారాయణ, బైరిశెట్టి చిరంజీవి, పోగు వెంకటేశ్వర్లు, బుడగం రాము, గుడ్ల రంజిత్, అత్తె సత్యనారాయణ, మాజీ సర్పంచులు ఊకే రామనాథం, పాయం నరసింహారావు, కొమరం విశ్వనాథం, కొమరం శ్రీను, భూక్య అర్జున్, గొగ్గల నారాయణ, నిట్టా ఏడుకొండలు, పోగు ఎల్లగౌడ్, పఠాన్ యాకుబ్ ఖాన్, ఈసం సమ్మయ్య, పులి శ్రీధర్, గుమ్మడివెళ్లి ప్రసాద్, భాస్కర్, యలగొండ శ్రీను, తోలెం రామారావు, మలకం వెంకటేశ్వర్లు, గుర్రం లాలు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు సిద్ధి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….